పెద్ది సినిమా...థియేట‌ర్ లో విజిల్స్ వేస్తూ మెగా హీరో ర‌చ్చ

by velandi.Saikiran |

మెగా హీరో వరుణ్ తేజ్ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ థియేటర్ లో పెద్ది సినిమా తిలకించారు.

పెద్ది సినిమా...థియేట‌ర్ లో విజిల్స్ వేస్తూ మెగా హీరో ర‌చ్చ
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. క్రీడాల నేపథ్యంలో వచ్చిన ఈ పెద్ది సినిమా, ఇవాళ రిలీజ్ కానుంది. నిన్నే ప్రీమియర్లు పడిపోయాయి. దీంతో చాలామంది రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమాను తిలకించి, ఎంజాయ్ చేశారు. సినిమా కథ నచ్చిన నేపథ్యంలో.. పాజిటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి.

అయితే ప్రీమియర్లు పడిన నేపథ్యంలో... మెగా హీరో వరుణ్ తేజ్ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ థియేటర్ లో సినిమా తిలకించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ సీన్స్ వచ్చినప్పుడల్లా విజిల్స్ వేస్తూ థియేటర్ లో రచ్చ రచ్చ చేశారు. ఓ సాధారణ అభిమాని లాగా... పైకి లేచి మరి అరుస్తూ, గోల‌ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. క్లిక్

Next Story