- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ అలర్ట్..నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా మంచిర్యాల, ఆసిఫాబాద్, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్సులు ఉన్నట్లు వెల్లడించింది.
50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గుతాయని స్పష్టం చేసింది. అటు ఏపీలో కూడా నేడు వర్షాలు పడనున్నట్లు APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.






