రైతుల‌కు గుడ్ న్యూస్‌...ఈ నెల 15 వరకు ధాన్యం కొనుగోళ్లు

by velandi.Saikiran |

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

రైతుల‌కు గుడ్ న్యూస్‌...ఈ నెల 15 వరకు ధాన్యం కొనుగోళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త అందింది. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. యాసంగిలో ఇప్పటి వరకు 70.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ వరకు ధాన్యం కొనుగోళ్ల‌ను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం నిలువలు అధికంగా ఉన్న నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలపై ఫోకస్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే హమాలీలు, స్వీపర్ల జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ధాన్యం కొనుగోళ్ల‌ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Next Story