ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ను అనుకరిస్తూ వెటకారం

by Malleboina Mahesh |   (  Updated:2026-01-08 04:17:05  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ను అనుకరిస్తూ వెటకారం
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి అంతర్జాతీయ వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రిపబ్లికన్ పార్టీ సభ్యుల సమావేశంలో (House GOP retreat) మాట్లాడుతూ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ (French President Emmanuel) మాక్రాన్‌ను అనుకరిస్తూ (mimicry) ఎగతాళి చేశారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే మందుల ధరలను ఫ్రాన్స్‌లో పెంచాలని, లేదంటే ఫ్రెంచ్ వైన్, షాంపైన్‌లపై 25% సుంకాలు (tariffs) విధిస్తానని తాను బెదిరించినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా మాక్రాన్ తనను బతిమాలినట్లు ట్రంప్ నటిస్తూ చూపించారు. "డోనాల్డ్, నేను నిన్ను వేడుకుంటున్నాను.. దయచేసి మా ప్రజలకు ఈ విషయం చెప్పొద్దు.. మీరు అడిగినట్లే మందుల ధరలు పెంచుతాను" అంటూ మాక్రాన్ అన్నట్లుగా ట్రంప్ అనుకరించారు. తాను బెదిరించిన కేవలం 3.2 నిమిషాల్లోనే ఇతర దేశాల అధినేతలు కూడా మందుల ధరలు పెంచడానికి అంగీకరించారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

Read More..

"ట్రంప్ సర్.. మీతో ఫోటో దిగొచ్చా" మోడీపై కాంగ్రెస్ మాస్ సెటైర్లు

Next Story