"ట్రంప్ సర్.. మీతో ఫోటో దిగొచ్చా" మోడీపై కాంగ్రెస్ మాస్ సెటైర్లు

by Muthe.Rajitha |

మోడీ–ట్రంప్ సంబంధాలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ మాస్ ర్యాగింగ్

ట్రంప్ సర్.. మీతో ఫోటో దిగొచ్చా మోడీపై కాంగ్రెస్ మాస్ సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని మోడీపై సెటైర్స్ వేస్తూ ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ షేర్ చేసింది. కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి పోస్ట్ చేసిన ఈ సెటైరికల్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోడీ మోడీ ట్రంప్‌కు ఫోన్ చేస్తున్నట్లు చూపిస్తూ.. " సర్ నేను మిమ్మల్ని కలవవచ్చా? మీతో ఫోటో దిగవచ్చా? రష్యా ఆయిల్ కొనుగోళ్లు ఆపివేయాలా? పాకిస్తాన్ తో కాల్పుల విరమణ చేసుకోవాలా?" అంటూ మోడీ ట్రంప్ ను రిక్వెస్ట్ చేస్తున్నట్టు చూపించారు.

దీనికి “Trump sir, may I see you please” అనే క్యాప్షన్ పెట్టి, గతంలో ‘హౌడీ మోడీ’ వంటి ఈవెంట్లలో దిగిన ఫోటోలు జత చేస్తూ.. ఇప్పుడు ట్రంప్ మోడీని పట్టించుకోవడం లేదన్నట్టుగా ఎద్దేవా చేసారు. మొత్తం మీద ఈ వీడియో మోడీ–ట్రంప్ సంబంధాలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ మాస్ ర్యాగింగ్ చేసినట్టు కనిపిస్తోంది. మరోవైపు నెట్టింట్లో ఈ వీడియోపై తీవ్ర దుమారం రేగుతోంది.

Next Story