- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనిజులా చమురు పరిశ్రమ పై ట్రంప్ వ్యూహం.. జాన్ సిటిలైడ్స్ సంచలన వ్యాఖ్యలు
వివిధ కారణాలతో అమెరికా వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ తర్వాత వెనిజులాను తామే తాత్కలికంగా పరిపాలిస్తామని ట్రంప్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: వివిధ కారణాలతో అమెరికా వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్ తర్వాత వెనిజులాను తామే తాత్కలికంగా పరిపాలిస్తామని ట్రంప్ ప్రకటించారు. అలాగే చమురు పరిశ్రమను నియంత్రించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశాలను 'ఫారిన్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' (Foreign Policy Research Institute) సీనియర్ ఫెలో జాన్ సిటిలైడ్స్ వివరించారు. వెనిజులాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వర్గాలను ఆయన "మాదకద్రవ్యాల ఉగ్రవాద నేర ముఠాలు" (Narco-terrorist criminal enterprises) గా అభివర్ణించారు. చట్టబద్ధంగా అమెరికాకు చెందాల్సిన ఆదాయాన్ని, ఆస్తులను ఈ ముఠాలు లాక్కున్నాయని, ఆ డబ్బును తమ అక్రమ కార్యకలాపాల కోసం వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
అమెరికా తదుపరి కార్యాచరణ గురించి వివరిస్తూ.. వెనిజులాలో భవిష్యత్తులో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడుతుందని అమెరికా ఆశిస్తోందని జాన్ తెలిపారు. ఆ కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా వెనిజులా చమురు పరిశ్రమను తిరిగి పునరుద్ధరించడమే అమెరికా లక్ష్యమని చెప్పారు. ఈ చర్య కేవలం అమెరికా ప్రయోజనాల కోసమే కాకుండా, వెనిజులా ప్రజలకు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చేలా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Read More..
మరిన్ని వాణిజ్య సుంకాలు విధిస్తాం.. భారత్‌పై ప్రెసిడెంట్ ట్రంప్ ఫైర్






