- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరిన్ని వాణిజ్య సుంకాలు విధిస్తాం.. భారత్‌పై ప్రెసిడెంట్ ట్రంప్ ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి భారత్‌పై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రష్యా (Russia) నుంచి భారత్ (India) ముడి చమురు కొనుగోళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత్‌పై త్వరలోనే మరిన్ని వాణిజ్య సుంకాలు (Tariffs) విధిస్తామని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ చాలా మంచి వ్యక్తి అని, కానీ చమురు కొనుగోళ్ల విషయంలో తాను సంతోషంగా లేననే విషయం మోడీకి కూడా తెలుసని అన్నారు. తాను సంతోషంగాఉండేలా చూసుకోవడం వారికి ముఖ్యమని ట్రంప్ నేరుగా వార్నింగ్ ఇచ్చారు.
అది ఉక్రెయిన్ పని కాదు...
రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారిక నివాసంపై డ్రోన్ దాడి ఉక్రెయిన్ చేసిందని రష్యా ఆరోపిస్తున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ నివాసాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోలేదని అమెరికా జాతీయ భద్రతా అధికారులు నిర్ధారించినట్లుగా తెలిపారు. ఈ విషయంలో నాటో దేశాలు కూడా మాస్కోకు మద్దతివ్వలేదని ట్రంప్ గుర్తు చేశారు.
Read More..






