- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండ్
ఇప్పటికే వెనుజులాను ఆక్రమించుకున్న అమెరికా.. తన నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండ్ అని స్పష్టం చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఇప్పటికే వెనుజులాను ఆక్రమించుకున్న అమెరికా.. తన నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండ్ అని స్పష్టం చేసింది. ఓ మీడియా ఇంటర్వ్యూలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. మాకు గ్రీన్లాండ్ అవసరం అయితే అది రక్షణ కోసం మాత్రమేనంటూ మరో బాంబ్ పేల్చారు. ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండ్ అని క్లారిటీ ఇచ్చినట్టు అర్థం అవుతోంది. అయితే గ్రీన్లాండ్‌ను అమెరికా ఆధీనంలోకి తీసుకోవాలనే అంశాన్ని ట్రంప్ తొలిసారి 2019లో వ్యక్తీకరించాడు. అప్పట్లో డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ ఈ ఆలోచనను పూర్తిగా తిరస్కరిస్తూ “ఇది వెర్రి ప్రతిపాదన” అని వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ డెన్మార్క్‌కు చెందిన ప్రాంతమే అయినప్పటికీ.. అక్కడ స్వయంపాలన వ్యవస్థ ఉంది.
ట్రంప్ మాత్రం ఆర్క్టిక్ ప్రాంతంలో గ్రీన్లాండ్ ఉన్న వ్యూహాత్మక స్థానం, ఖనిజ సంపద, భద్రతా అవసరాల కారణంగా అది అమెరికాకు అవసరమని అప్పట్లో చెప్పాడు. తాజాగా మళ్లీ ఈ అంశం చర్చకు వచ్చింది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టు తర్వాత... "ది అట్లాంటిక్"" మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ "మాకు గ్రీన్లాండ్ అవసరం, అయితే అది చమురు కోసం కాదు. కేవలం రక్షణ కోసం మాత్రమే" అని వ్యాఖ్యానించాడు. అలాగే 2025 డిసెంబర్‌లో లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీని గ్రీన్లాండ్‌కు స్పెషల్ ఎన్వాయ్‌గా నియమించడం యూరప్ దేశాల్లో ఆందోళన కలిగించింది. దీనికి తోడు ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ భార్య కేటీ మిల్లర్ సోషల్ మీడియాలో గ్రీన్లాండ్‌పై అమెరికా జెండా ఫోటో పెట్టి “త్వరలో” అని క్యాప్షన్ ఇవ్వడం మరింత వివాదానికి దారితీసింది.
దీనిపై డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ తీవ్రంగా స్పందిస్తూ "గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు, అమెరికాకు దాన్ని అనెక్స్ చేసే హక్కు లేదు" అని స్పష్టం చేశారు. డెన్మార్క్ ఇప్పటికే నాటో సభ్య దేశమని, అమెరికాకు అవసరమైన రక్షణ సహకారం ఇప్పటికే ఉందని తెలిపారు. గ్రీన్లాండ్ నాయకులు కూడా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్‌లో సుమారు 56 వేల మంది మాత్రమే జనాభా ఉంది. అక్కడ ఇప్పటికే అమెరికాకు చెందిన థులే ఎయిర్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ గ్రీన్లాండ్‌పై చూపుతున్న ఆసక్తి అంతర్జాతీయంగా మరోసారి పెద్ద చర్చకు దరి తీసింది.
Read More..
మరిన్ని వాణిజ్య సుంకాలు విధిస్తాం.. భారత్‌పై ప్రెసిడెంట్ ట్రంప్ ఫైర్






