ఇరాన్ తర్వాత త‌న నెక్ట్స్ టార్గెట్ ఆ దేశ‌మే..ట్రంప్ సంచ‌ల‌నం

by velandi.Saikiran |   (  Updated:2026-03-06 11:12:55  IST  )

ఇరాన్ తర్వాత క్యూబా సంగతి చూస్తానని వైట్ హౌస్ లోని ఓ ఈవెంట్ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు ట్రంప్.

Strait of Hormuz dispute Big shock for America
X

Strait of Hormuz dispute Big shock for America

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ దేశానికి చుక్కలు చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది క్లారిటీ ఇచ్చారు. ఇరాన్ పై యుద్ధం చేస్తూ ఈ దేశం పైన ప్రస్తుతం ఫుల్ ఫోకస్ చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అయిపోయిన తర్వాత వెంటనే క్యూబా సంగతి చూస్తానని వైట్ హౌస్ లోని ఓ ఈవెంట్ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు ట్రంప్. అమెరికాతో డీల్ చేసుకునేందుకు క్యూబా ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అమెరికా... క్యూబా పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఇదే క్యూబాపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్నేహ పూర్వకంగా క్యూబాను దక్కించుకునే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు.

ఇకేసారి ఇరాన్‌, క్యూబాకు ట్రంప్ వార్నింగ్ !

అయితే లేటెస్ట్ గా క్యూబా సంగతి చూస్తాం అంటూ ట్రంప్‌ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. మరి ఇరాన్ యుద్ధం అయిన తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఇక అటు ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు ట్రంప్. ఇరాన్ లోని సైన్యం, IRGC, పోలీసులు ఆయుధాలు వదిలేయాలని మరోసారి పిలుపునిచ్చారు ట్రంప్. పోరాటంతో ప్రాణాలు పోవడం తప్ప ఇంకేమీ ఉండదని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలకు సహకరించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ఇప్పుడు లొంగిపోతే ప్రాణాలకు ఎలాంటి హాని ఉండబోదని హామీ ఇచ్చారు. లేదంటే చావు తప్పదని వార్నింగ్ కూడా ఇచ్చారు ట్రంప్.

ఇరాన్ సుప్రీం లీడర్‌ను నేనే ఎంపిక చేస్తా: ట్రంప్

Next Story