- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్ సుప్రీం లీడర్‌ను నేనే ఎంపిక చేస్తా: ట్రంప్
ఇరాన్ సుప్రీం లీడర్ ను తానే ఎంపిక చేస్తానని వెల్లడించారు ట్రంప్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరు రోజులుగా యుద్ధం చాలా భయంకరంగా సాగుతోంది. ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇంకా ఈ యుద్ధం కారణంగా ఈ మూడు దేశాలకు సంబంధించిన సైనికులు ప్రాణాలు అర్పిస్తున్నారు. అటు మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా వణికి పోతున్నాయి. ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న మన భారతీయులు నరకం అనుభవిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ను తానే ఎంపిక చేస్తానని వెల్లడించారు ట్రంప్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ ఎంపికపై ట్రంప్ ప్రకటన !
ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడి నేపథ్యంలో మొన్నటి వరకు ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఆయన కార్యాలయం పై దాదాపు 30 బాంబులను ఇజ్రాయెల్ వేసినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. అయితే ఇలాంటి తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఎన్నిక విషయంలో తాను ఇన్వాల్వ్ అవుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. కామేని కుమారుడు ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యే అవకాశం ఉందని... దీన్ని తాను అస్సలు అంగీకరించబోనని ట్రంప్ ప్రకటన చేయడం హాట్ టాపిక్ అయింది.
శాంతి, సామరస్యాన్ని తీసుకువచ్చే వ్యక్తిని ఇరాన్ సుప్రీం లీడర్ గా తీసుకురావాలని తాను కోరుకున్నట్లు వెల్లడించారు. యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఖమేనీ కొడుకు ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ అయితే.. ప్రయోజనం ఉండదని.. టైం అస్సలు వృధా చేయకూడదని సూచనలు చేశారు. వెనిజులలో డెల్సీని ఎంపిక చేసినట్లుగానే తాను కూడా ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంలో పాల్గొనాలని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై ఖమేనీ వర్గీయులు చాలా సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది. తమ సుప్రీం లీడర్ ఎంపికలో ఎవరి జోక్యం అవసరం లేదని చెబుతున్నారు.






