- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటో దేశాలు పిరికివి.. వాటిని గుర్తుపెట్టుకుంటా: ట్రంప్ అసహనం
ఇరాన్‌పై యుద్ధం మరో దశకు చేరుకోబోతున్నట్టు తెలుస్తున్నది. మిలిటరీ స్థావరాలు, నాయకత్వం లక్ష్యంగా జరిగిన దాడులు.. మొన్నే చమురు కేంద్రాలపైకీ మళ్లింది.

ఇరాన్‌లోకి సైన్యం?
- 5 వేల మంది సైనికులతో మరో మూడు అమెరికా యుద్ధ నౌకలు
- నాటో దేశాలు పిరికివి.. వాటిని గుర్తుపెట్టుకుంటా: ట్రంప్ అసహనం
- శత్రువులను ఓడించాం: ఇరాన్ పౌరులకు సుప్రీం సందేశం
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌పై యుద్ధం మరో దశకు చేరుకోబోతున్నట్టు తెలుస్తున్నది. మిలిటరీ స్థావరాలు, నాయకత్వం లక్ష్యంగా జరిగిన దాడులు.. మొన్నే చమురు కేంద్రాలపైకీ మళ్లింది. ఇప్పుడు నేరుగా అమెరికా సైన్యాన్ని ఇరాన్ దేశానికి పంపుతున్నట్టు తెలుస్తు్న్నది. ఇది వరకే యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, యూఎస్ఎస్ అబ్రహం లింకన్ వంటి భారీ యుద్ధ నౌకలు ఇరాన్ సమీప జలాల్లో అమెరికా మోహరించింది. ఈ యుద్ధ నౌకలు ఇరాన్‌పై భీకర దాడికి ఉపయోగపడ్డాయి. అయితే, ఇప్పుడ భూతలదాడులకు అమెరికా సిద్ధమైంది. ఇందుకోసం మరో మూడు వార్‌షిప్‌లను ఇరాన్ వైపు పంపింది. సుమారు 5 వేల మంది ఆంఫిబియస్ యూనిట్‌ను పంపినట్టూ తెలుస్తున్నది. యూఎస్ఎస్ బాక్సర్, ట్రిపోలి సహా మూడు ఆంఫిబియస్ అజాల్డ్ షిప్‌లు ఇరాన్ వైపు వెళ్లుతున్నట్టు ఓ అమెరికా అధికారి శుక్రవారం ధ్రువీకరించారు. వీటిపై సుమారు 2,500 మంది మెరైన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. ఇది చాలా సెన్సిటివ్ మిలిటరీ ఆపరేషన్ అని పేర్కొంటూ వివరాలను వెల్లడించడానికి మరో ఇద్దరు అమెరికా అధికారులు నిరాకరించారు.
ఆ రెండు టార్గెట్ల కోసమే?
ఇరాన్ సైన్యాన్ని, నేవీని, వైమానిక దళాలను, నాయకత్వాన్ని, ఆయుధగారాలను, అండర్‌గ్రౌండ్లను ధ్వంసం చేశామని, అసలు అక్కడేమీ లేదన్నట్టుగా ట్రంప్ చెప్పారు. కానీ, అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ గ్రౌండ్ ట్రూప్‌లను ఇరాన్ వైపునకు పంపిస్తున్నారు. ఈ సైన్యాన్ని ఇరాన్‌కు పంపడానికి రెండు టార్గెట్లు ట్రంప్‌కు ఉండొచ్చనే చర్చ జరుగుతున్నది. హోర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని, విదేశీ నౌకలను ఈ జలసంధి గుండా పంపడానికి సేఫ్‌గా మార్చడానికి ఈ ట్రూపులను పంపుతున్నట్టు చెబుతున్నారు. ఈ ఆంఫిబియస్ వార్‌షిప్‌లు యుద్ధనౌకల వంటివే అయినా.. తీరానికి సమీపంగా తక్కువ లోతున్న ప్రాంతానికీ చేరుకోగలవు. ఈ వార్‌షిప్‌లపై సైన్యం తీరంలోని ఇరాన్‌కు చెందిన ఓ కీలక దీవికి చేరుకుని జలసంధి గుండా వెళ్లే నౌకలకు రక్షణ కల్పించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. మరో లక్ష్యం శుద్ధిచేసిన యురేనియం, ఖార్గ్ దీవి ఉండొచ్చని వివరిస్తున్నారు. ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు చేసినా.. భూగర్భంలో శుద్ధిచేసిన యురేనియం సేకరించడానికి నేరుగా సైన్యం పోకతప్పదు. దీనికితోడు ఖార్గ్ దీవిపైనున్న సంపదను సైతం ధ్వంసం చేయకుండా స్వాధీనం చేసుకోవాలన్నది ట్రంప్ ఆలోచన అని చెబుతున్నారు.
మా మిత్రదేశాలను గుర్తుంచుకుంటా..
అమెరికా మిత్రదేశాలు నాటో సభ్యదేశాలపై ట్రంప్ విరుచుకుపడ్డారు. హోర్ముజ్ జలసంధిని కాపాడటానికి ముందుకు రావాలని కోరితే రాలేవని, కానీ, చమురు ధరలు పెరుగుతున్నాయని గగ్గోలు పెడుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే తాము ఇరాన్ సైన్యాన్ని చాలా వరకు నాశనం చేశామని, చివరిలో కొంత ప్రతిఘటన ఉంటే ఉండొచ్చమేనని, అందుకూ నాటో దేశాలు సిద్ధపడకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. వాళ్లకు అది చాలా చిన్న రిస్క్ అని పేర్కొంటూ.. ‘పిరికిపందలు, మిమ్మల్ని నేను గుర్తుంచుకుంటా’ అంటూ మండిపడ్డారు.
ఐఆర్‌జీసీ ప్రతినిధి హతం
ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ ఐఆర్‌జీసీ ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ మరణించినట్టు వెల్లడించింది. ఇంకా తమ దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఇజ్రాయెల్ వెల్లడించింది. కాగా, జెరూసలేం ఓల్డ్ సిటీపై ఇరాన్ దాడులకు తెగబడుతున్నదని ఇజ్రాయెల్ ఆరోపించింది. అక్కడ సైరన్లు వేయడంతో ప్రార్థనలు చేసుకునేవాళ్లు పరుగులుతీశారు. కాగా, కువైట్‌లోని ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ మరోసారి దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ఓ రిఫైనరీ దారుణంగా డ్యామేజీ అయింది. ఒమన్, తుర్కియే దేశాలపైకీ ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లు పంపినట్టు వార్తలు రాగా, ఇరాన్ ఖండించింది.






