- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాకు శ్రీలంక షాక్..ఒత్తిడికి లొంగేది లేదంటూ ప్రకటన!
అమెరికా యుద్ధ విమానాల ల్యాండింగ్ కు పర్మిషన్ నిరాకరించింది శ్రీలంక. ఈ విషయాన్ని శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకే ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా అమెరికా యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 20 రోజులుగా ఈ మూడు దేశాలు కొట్టుకు చస్తున్నాయి. అయితే ఇరాన్ ను ముప్ప తిప్పలు పెట్టిన కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్, అమెరికాకు చుక్కలు చూపిస్తూనే ఉంది ఇరాన్. అయితే ఈ నేపథ్యంలో అమెరికాకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ సారి ఇరాన్ రూపంలో కాకుండా శ్రీలంక రూపంలో అమెరికాకు షాక్ తగిలింది.
ఒత్తిడికి లొంగేది లేదు
అమెరికా యుద్ధ విమానాల ల్యాండింగ్ కు పర్మిషన్ నిరాకరించింది శ్రీలంక. ఈ విషయాన్ని స్వయంగా శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకే ( Anura Kumara Dissanayake ) పార్లమెంట్ వేదికగా ప్రకటన చేశారు. మట్టాల విమానాశ్రయంలో ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేందుకు ఈ నెల 4, 8 తేదీలలో అమెరికా నుంచి వచ్చిన రెండు రిక్వెస్ట్ లను రిజెక్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. తమకు ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ ఒత్తిడికి లొంగిపోయేది లేదని స్పష్టం చేశారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం సవాళ్లు విసిరితోందని తెలిపారు. తాము న్యూట్రల్ గా ఉండేందుకు సాధ్యమైనంతగా కృషి చేస్తామని శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకే స్పష్టం చేశారు.






