- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే నెల 27న ఇజ్రాయెల్ పర్యటనకు ప్రధాని మోడీ
ఫిబ్రవరి 27న ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారు. 27, 28 తేదీలలో మోడీ ఆ దేశంలో పర్యటించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఫిబ్రవరి 27న ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారు. 27, 28 తేదీలలో మోడీ ఆ దేశంలో పర్యటించనున్నారు. రక్షణ, ఉగ్రవాద నిర్మూలనపై వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ ను సంప్రదించాలని మెడీకి ఆహ్వానం అందినట్టు భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ స్పష్టం చేశారు. మోడీ ప్రధానమంత్రిగా మొదటిసారి 2017లో ఇజ్రాయెల్ లో పర్యటించారు. ఈ పర్యటనలో ప్రధాని బెంజిమోన్ నెతన్యాహుతో మోడీ ఎక్కువ సమయం గడిపారు.
సాధారణంగా అమెరికా అధ్యక్షుడిగే ఇలాంటి గౌరవం దక్కగా మొదటిసారి ప్రధానికి సైతం అలాంటి గౌరవం దక్కడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా 70ఏళ్ల తరవాత ఇజ్రాయెల్ లో అడుగుపెట్టిన భారత ప్రధానిగా మోడీ నిలిచారు. ఈ పర్యటన తరవాత భారత్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నతస్థాయి రాజకీయ సమావేశాలు జరగ్గా అనేక ఒప్పందాలు కుదిరాయి. మళ్లీ తొమ్మిదేళ్ల తరవాత మోడీ ఇజ్రాయెల్ వెళుతుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.






