- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'వికసిత్ భారత్' లక్ష్యంగా బడ్జెట్.. నిర్మలమ్మ అరుదైన రికార్డుపై ప్రధాని మోడీ ప్రశంసలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభం అయ్యాయి. అనంతరం ఈ రోజు ఈ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ప్రసంగంతో ప్రారంభం అయ్యాయి. అనంతరం ఈ రోజు ఈ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) కీలక ప్రసంగం చేశారు. 21వ శతాబ్దంలో మొదటి పావు వంతు (25 ఏళ్లు) పూర్తయిందని, ఇప్పుడు తదుపరి పావు వంతు లోకి అడుగుపెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ 25 ఏళ్ల కాలం అత్యంత కీలకమని, ఈ కొత్త దశలో ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ సామాన్యుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూనే, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదిగేందుకు పునాదులు వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరికాసేపట్లో పార్లమెంట్ 2026-27 ఆర్థిక సర్వే పార్లమెంట్ ముందుకు రానుంది.
మరోవైపు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారని ప్రధాని కొనియాడారు. వరుసగా 9వ సారి పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న భారతదేశపు తొలి ఆర్థిక మంత్రిగా, అలాగే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్నారని ప్రశంసించారు. "ఇది మన పార్లమెంటరీ చరిత్రలోనే గర్వించదగ్గ క్షణం" అని మోడీ పేర్కొన్నారు. కాగా, ఈ ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ, అదే రోజున నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం విశేషం. ఈ బడ్జెట్ పై దేశవ్యాప్తంగా ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలు ఉన్న రాష్ట్రాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి.






