- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2025లో భారత్ బలమేంటో ప్రపంచం చూసింది.. మన్ కీ బాత్‍లో మోడీ
129వ మన్ కీ బాత్‌లో 2025 సంవత్సరంలో భారతదేశం సాధించిన విజయ క్షణాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త ఆశలు, కొత్త సంకల్పంతో 2026లోకి అడుగు పెడుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అన్నారు. ప్రయాగ్ రాజ్ కుంభమేళాతో ప్రారంభమైన 2025 సంవత్సరం భారతదేశం జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ వంటి ప్రతి అంశంలో ప్రపంచంలోని అతిపెద్ద వేదికల్లో బలమైన ముద్ర వేసిందన్నారు. ఇవాళ 129వ మన్ కీ బాత్ ఎడిషన్ కార్యక్రమంలో (Mann Ki Baat 129th Edition) దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. 2025 సంవత్సరంలోని అంశాలను గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారడానికి ఎన్నో క్షణాలను ఇచ్చిందని ఆపరేషన్ సిందూర్ మారుతున్న భారతావనిగా అభివర్ణించిన మోడీ.. సైనిక విజయాన్ని దేశవ్యాప్త దేశభక్తిని పెంచిన ఘటనగా ప్రశంసించారు. ఈ ఆపరేషన్ ఈ ఏడాది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‍తో నేటి భారతదేశం తన భద్రత విషయంలో రాజీపడదని ప్రపంచం స్పష్టంగా చూస్తుందని చెప్పారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలు అదే స్ఫూర్తిని మరియు ఉత్సాహాన్ని చూపించినందుకు మోడీ అభినందించారు.
వికసిత్ భారత్ ద్వారా దేశం అన్ని విభాగాల్లో ముందుకెళ్తోందని మోడీ చెప్పారు. రెండో యంగ్ ఇండియా లీడర్ సదస్సు జనవరి 12న జరగనుందని ఇందులో వివిధ ప్రాంతాల యువత తమ ఆలోచనలు పంచుకుంటారని చెప్పారు. యంగ్ ఇండియా లీడర్ సదస్సులో నేనూ తప్పనిసరిగా పాల్గొంటానని చెప్పారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో విద్యార్థులు 70 అంశాలపై ప్రతిభ చూపారని స్మార్ట్ ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీపై ఆవిష్కరణలు ప్రదర్శించారన్నారు. 2025 క్రీడల పరంగా కూడా చిరస్మరణీయమైన సంవత్సరం అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంటే మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. మహిళల అంధుల T20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా భారత కుమార్తెలు చరిత్ర సృష్టించారని మోడీ ప్రశంసించారు. ఆసియా కప్ T20లో త్రివర్ణ పతాకం కూడా గర్వంతో రెపరెపలాడిందని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అనేక పతకాలు గెలుచుకున్నందుకు పారా-అథ్లెట్లను కూడా ఆయన ప్రశంసించారు. గతేడాది వారణాసిలో కాశీ-తమిళ సంగమం జరుపుకున్నాం.వారణాసిలోని పిల్లలు తమిళం మాట్లాడుతున్నారు. మాతృభాష హిందీ అయినప్పటికీ తమిళం నేర్చుకుని మాట్లాడుతున్నారన్నారు. దేశంలో చిరుతల సంఖ్య 30 దాటిందని గుర్తు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, మహిళా సాధికారత, వోకల్ ఫర్ లోకల్ దేశీయ ఉత్పుత్తుల ప్రోత్సాహం వంటి అంశాలను మోడీ ప్రస్తావించారు.
Read More..
Congress: మా పని అయిపోయిందంటున్నారు కానీ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై ఖర్గే ఫైర్






