- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: మా పని అయిపోయిందంటున్నారు కానీ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై ఖర్గే ఫైర్
కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని బీజేపీ, ఆర్ఎస్ఎస్‍కు వ్యతిరేకంగా పోరాడాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) పిలుపునిచ్చారు. ఇవాళ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ (Congress Foundation Day) వేడుకలు ఢిల్లీలోని ఇందిరా భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‍తో పాటు పార్టీ నేతలు హాజరైన ఈ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ బీజేపీ (BJP), ఆర్ఎస్ఎస్‍పై (RSS) ఫైర్ అయ్యారు. ప్రజల అధికారాలను ఆర్ఎస్ఎస్ లాక్కునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
మా పని అయిపోలేదు:
కాంగ్రెస్ పని అయిపోయిందని అంటున్నారు. మా శక్తి తగ్గింది కానీ పోరాటం ఆగలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో అనేక చారిత్రాత్మక మార్పులొచ్చాయని హరిత విప్లవం, ఆర్థిక సంస్ఖరణలు, ఐటీ విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ హాయంలో ఏర్పాటు చేసిన సంస్థలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు.
బీజేపీ విభజన రాజకీయాలు:
కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఐక్యపరుస్తుంటే బీజేపీ విడదీస్తోందని కాంగ్రెస్ ఏనాడు మతం పేరుతో ఓట్లు అడగలేదన్నారు. మా పోరాటం ఎన్నికల గురించి కాదని దేశం కోసమే మా పోరాటం అన్నారు. రాజ్యాంగం, లౌకిక వాదం, హక్కుల రక్షణలో రాజీ పడేదిలేదన్నారు. కాంగ్రెస్ పోరాడకపోతే రాజ్యాంగాన్ని, దేశాన్ని ఎవరు పరిరక్షిస్తారన్నారు. యూపీఏ హయాంలో ఆర్టీఐ, ఎంజీ నరేగా, ఆహార భద్రతా చట్టాలు తీసుకొచ్చాం. అటవీ హక్కులు, భూసేకరణ చట్టాలు తెచ్చాం. కాంగ్రెస్ నిర్మించిన అనేక సంస్థలను మోడీ 11 ఏళ్లుగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు జాతీయ జెండా, రాజ్యాంగాన్ని అగౌరవపరిచారు.
Read More..
ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: కల్వకుంట్ల కవిత






