ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: కల్వకుంట్ల కవిత

by Jakkula.Mamatha |   (  Updated:2025-12-28 06:03:58  IST  )

ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: కల్వకుంట్ల కవిత
X

దిశ, ఆమనగల్లు: ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో చేపట్టిన జనం బాట ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లుకు చేరుకుంది. శనివారం రాత్రి కడ్తాల్ మండలం సాలర్ పూర్ లో బస చేసిన కవిత ఆదివారం ఉదయం జాగృతి నాయకులతో కలిసి ఆమనగల్లు మున్సిపల్ కేంద్రంలోని 6వ వార్డు లో ప్రజల ఇండ్ల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వల్ల ప్రతిరోజు విపరీత కాలుష్యం పెరుగుతుందని, ఇక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పందించి డంపింగ్ యార్డ్ ను నివాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఫిబ్రవరి వరకు గడువు ఇస్తున్నామని, తరలించిన పక్షంలో ఫిబ్రవరి అనంతరం డంపింగ్ యార్డ్ తరలింపు పై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Read More..

Congress: మా పని అయిపోయిందంటున్నారు కానీ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై ఖర్గే ఫైర్

Next Story