- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయి: ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో వీడిపోవడంపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు..

దిశ, వెబ్ డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill) పార్లమెంట్‌లో వీగిపోవడంపై ప్రధాని మోడీ(Pm Modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని మోడీ మండిపడ్డారు. ఇందుకు తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని ఆయన హెచ్చరించారు. మహిళలకు తప్పకుండా విపక్షాలు సమధానం చెప్పి తీరాల్సిందేనన్నారు. ఢిల్లీలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ
అంతకుముందు ప్రధాని మోడీ అధ్యక్షతన దేశ రాజధాని పార్లమెంట్ హౌస్‌లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) సమావేశం జరిగింది. దేశ భద్రత, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, వివిధ మంత్రిత్వ శాఖలు చేపట్టిన చర్యలపై చర్చించారు. ప్రధానంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దాని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావంపై చర్చించారు. పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడటంతో పాటు, దేశవ్యాప్తంగా విద్యుత్ లభ్యతపై కూడా ప్రధాని అధికారులతో సమీక్షించారు.
సామాన్య ప్రజలకు..
సామాన్య ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువుల లభ్యత, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆహారం, ఇంధనం, అలాగే ఇంధనం భద్రతకు సంబంధించి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను ఖరారు చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు.






