నాకు, మోడీకి ఆ సమస్య లేదు.. లోక్‌సభలో రాహుల్ చమక్కులు

by Muthe.Rajitha |   (  Updated:2026-04-18 08:21:28  IST  )

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 131 రాజ్యాంగ సవరణ చర్చలో పాల్గొంటూ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.

నాకు, మోడీకి ఆ సమస్య లేదు.. లోక్‌సభలో రాహుల్ చమక్కులు
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు కీలకమైన మూడు బిల్లులపై లోక్‌సభలో జరుగుతున్న చర్చ రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, కొన్ని చమత్కారాలు కూడా మెరిసాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 131 రాజ్యాంగ సవరణ చర్చలో పాల్గొంటూ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించడమే కాకుండా, చర్చలో ఉన్న ఉద్రిక్తతను ఒక్కసారిగా తగ్గించాయి. దేశానికి మహిళలే అసలైన చోదకశక్తి అని అభివర్ణించిన రాహుల్, ప్రతి పురుషుడు తన జీవితంలో తల్లి, సోదరి లేదా భార్య నుంచి ఎంతో నేర్చుకుంటారని, వారి ప్రభావం వ్యక్తుల ఎదుగుదలపై ఎంతో ఉంటుందని హుందాగా పేర్కొన్నారు.

అయితే, చర్చ మధ్యలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన ఒక సరదా వ్యాఖ్యను ప్రస్తావిస్తూ రాహుల్ చేసిన చమత్కారం హైలైట్‌గా నిలిచింది. అంతకుముందు రిజిజు మాట్లాడుతూ.. తాను తన భార్య కోసం కవితలు రాయనందుకు ఇంట్లో తిట్లు తిన్నానని సరదాగా చెప్పారు. దీనికి స్పందనగా రాహుల్ గాంధీ.. "వాస్తవానికి, గౌరవనీయ ప్రధాని మోదీకి మరియు నాకు ఆ 'భార్య సమస్య' లేదు" అని వ్యాఖ్యానించడంతో సభలోని సభ్యులందరూ ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేకపోయారు. తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, రాహుల్ చేసిన ఈ సెల్ఫ్-డిప్రికేటింగ్ హ్యూమర్ అందరినీ అలరించింది.

విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయి: ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహం

Next Story