హింసాత్మకంగా మారిన నిరసనలు.. అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన నేపాల్ ప్రధాని

by Malleboina Mahesh |   (  Updated:2025-09-09 07:39:21  IST  )

నేపాల్ ప్రధాని కె.పి. శర్మ ఓలి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. “దేశంలో శాంతి నెలకొల్పడానికి, సంక్షోభానికి పరిష్కారం కనుగొనడానికి అన్ని పార్టీలతో చర్చిస్తానని ప్రకటన విడుదల చేశారు.

హింసాత్మకంగా మారిన నిరసనలు.. అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన నేపాల్ ప్రధాని
X

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధంపై ప్రజా వ్యతిరేకత తీవ్రరూపం దాల్చింది. ఇటీవల ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ములపై నిషేధం విధించగా, దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత Gen Z ఉద్యమం (Gen -Z movement) పేరుతో భారీ ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ఈ నిరసనలు అనేక ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి. కాఠ్మాండు సహా పలు పట్టణాల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.

పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరపగా, కనీసం 19 మంది మృతి చెందగా వందలాది గాయపడ్డారు. రాజధానిలో కర్ఫ్యూ ప్రకటించబడింది. ఇంతలో ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్న హోమ్ మంత్రి రాజీనామా చేసి, తన పదవీ విరమణ పత్రాన్ని ప్రధానికి సమర్పించారు. ప్రస్తుతం ఆయన దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే Gen Z నిరసనకారులు వెనక్కి తగ్గేలా లేరు.

“అవినీతి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం. ప్రధాని రాజీనామా చేయాలి” అని వారు స్పష్టం చేస్తున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాల నడుమ నేపాల్ ప్రధాని కె.పి. శర్మ ఓలి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. “దేశంలో శాంతి నెలకొల్పడానికి, సంక్షోభానికి పరిష్కారం కనుగొనడానికి అన్ని పార్టీలతో చర్చిస్తాను. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలి” అని ఆయన ప్రకటన విడుదల చేశారు.

Read More..

kp sharma oli: ఖాట్మండులో మరోసారి ఉద్రిక్తత..దుబాయ్‌కి పారిపోతున్న ప్రధాని!

Next Story