- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
kp sharma oli: ఖాట్మండులో మరోసారి ఉద్రిక్తత..దుబాయ్‌కి పారిపోతున్న ప్రధాని!
నేపాల్ రాజధాని ఖాఠ్మండులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో సోషల్ మీడియాను పునరుద్దరించినప్పటికీ జెన్ జడ్ నిరసనలు ఆగడంలేదు. సోషల్ మీడియా బ్యాన్, అవినీతికి వ్యతిరేకంగా యువత రోడ్లపైకి వచ్చి నిరసనను కొనసాగిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: నేపాల్ రాజధాని ఖాఠ్మండులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో సోషల్ మీడియాను పునరుద్దరించినప్పటికీ జెన్ జడ్ నిరసనలు ఆగడంలేదు. సోషల్ మీడియా బ్యాన్, అవినీతికి వ్యతిరేకంగా యువత రోడ్లపైకి వచ్చి నిరసనను కొనసాగిస్తున్నారు. తాజాగా పార్లమెంట్ ముందు నిరసనకారులు రెచ్చిపోయారు. సమాచారశాఖ మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. మరోవైపు నేపాల్ ప్రధాని కేపీ శర్మ అనారోగ్యం కారణంగా చికిత్స కోసం దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే ప్రధాని కోసం ఓ ప్రైవేటు విమానాన్ని సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
దేశంలో కొనసాగుతున్న ఆందోళన కర పరిస్థితుల మధ్య కేపీ శర్మ దుబాయ్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఒత్తిడి పెరగటంతోనే ప్రధాని దుబాయ్ వెళున్నారని సైతం ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా రాజీనామా దిశగా ఆలోచిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా తాత్కాలిక బాధ్యతలను ఉపప్రధానికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే నేపాల్ హోం మంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
నిరసనల్లో 19 మంది యువకులు మరణించడానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఆయన తరవాత మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి ప్రదీప్ పౌడెల్, వ్యవసాయ మంత్రి రామ్ నాథ్ సైతం రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లను నిషేధించడం వల్లనే నేపాల్ లో అల్లర్లు మొదలయ్యాయి. ముఖ్యంగా 1995–2010 మధ్య జన్మించిన జెన్ జడ్ యువత సోమవారం బయటకు వచ్చి పెద్ద సంఖ్యంలో ఖాఠ్మండు వీధుల్లో నిరసన తెలిపారు. యువత రెచ్చిపోయి నిషేదిత ప్రాంతంలోకి వచ్చి చెట్లను విరిచేయడం, బాటిళ్లను విసరడంతో పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 20మంది వరకు చనిపోయడం, చాలా మంది గాయపడటంతో ఉద్రిక్తత తీవ్రతరం అయ్యింది.
Read More..
హింసాత్మకంగా మారిన నిరసనలు.. అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన నేపాల్ ప్రధాని






