ఎలక్షన్ కమిషనర్ పై మమతా బెనర్జీ ఫైర్

by Taduka Kalyani |   (  Updated:2026-02-02 13:27:48  IST  )

ఎలక్షన్ చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు

ఎలక్షన్ కమిషనర్ పై మమతా బెనర్జీ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎలక్షన్ చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎలక్షన్ కమిషనర్ తో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అందులో పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితాల సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) పై చర్చ జరిగింది. ఈ ప్రక్రియను పక్షపాతపూరితంగా, వివక్షతో కూడినదిగా బెనర్జీ, ఆమె పార్టీ అభివర్ణించాయి. సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ హెడ్ క్వార్టర్ ముందు మీడియా సమావేశంలో మమతా మాట్లాడారు. మమతా బెనార్జీ మాట్లాడుతూ.. “ నేనే ఢిల్లీ రాజకీయాల్లో చాలా ఏళ్ల నుంచి క్రియాశీలకంగా పనిచేశాను. నేను 4 సార్లు మినిస్టర్ గా 7 సార్లు ఎంపీగా పనిచేశాను. ఇంత కాలం నా అనుభవంలో ఇలాంటి అహంకారీ.. అబద్ధాల కోరు ఎలక్షన్ చీఫ్ కమిషనర్ ను చూడలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. నేను వారికి చెప్పాను మీ చైర్ కి నేను గౌవరం ఇస్తాను. కానీ ఎవరూ కూడా ఆ చైర్ కు పరిమితం కారు అని అన్నారు. ఎదో ఒకరోజు మీరు కూడా ఈ చైర్ ను వదిలేయల్సిందే అన్నారు. ఎందుకు బెంగాల్ నే టార్గెట్ చేశారు. ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యంలో పండుగ లాంటింది. కానీ మీరు 58 లక్షల ఓటర్లను తొలగించారని కనీసం తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

నల్ల దుస్తులతో వెళ్లి ఈసీని కలిసిన CM మమతా బెనర్జీ

Next Story