- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్ల దుస్తులతో వెళ్లి ఈసీని కలిసిన CM మమతా బెనర్జీ
కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. ‘సర్’ బాధితులు, టీఎంసీ బృందంతో కలిసి ఈసీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియను నిరసిస్తూ నల్ల దుస్తులు ధరించారు. అంతకుముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో భారత ఎన్నికల సంఘం, పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారిని ప్రతివాదులుగా చేర్చుతూ బెనర్జీ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్‌లో, రాష్ట్రంలో జరుగుతున్న SIR ప్రక్రియను ఆమె ప్రశ్నించారు. జనవరి 28న ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్నికల కమిషన్ తెలిపిన ప్రకారం.. రెండో దశ SIR కార్యక్రమం దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. ఇవి అండమాన్-నికోబార్ ద్వీపాలు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రాలు దేశవ్యాప్తంగా పెద్ద ఓటర్ల సంఖ్య కలిగి ఉండటంతో, సవరణ ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని ECI నిర్ణయించింది. ఈ సవరణ ప్రక్రియ దశలవారీగా జరుగుతుంది. అక్టోబర్ 28 నుండి నవంబర్ 3 వరకు ముద్రణ మరియు శిక్షణ దశ ఉంటుంది. అనంతరం నవంబర్ 4 నుండి డిసెంబర్ 4 వరకు ఇంటింటికీ గణన దశ చేపడతారు. ఆ తర్వాత, డిసెంబర్ 9న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.






