- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెహ్రాన్ గుండెకాయపై ఇజ్రాయెల్ గురి.. రాజధానిలో వరుస పేలుళ్లు!
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం అత్యంత తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీని హతమార్చిన మరుసటి రోజే.. ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై విరుచుకుపడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం అత్యంత తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన మరుసటి రోజే.. ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై విరుచుకుపడింది. నగరంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ క్షిపణులతో దాడులు చేయడంతో టెహ్రాన్‌లో వరుస భారీ పేలుళ్లు సంభవించాయి.
టెహ్రాన్‌కు మార్గం సుగమం చేశాం: ఐడీఎఫ్
‘ఉగ్రవాద పాలన కొనసాగిస్తున్న ఇరాన్ రాజధాని గుండెకాయపై (హార్ట్ ఆఫ్ ద సిటీ) తాము దాడులు చేస్తున్నాం. టెహ్రాన్‌కు మార్గం సుగమం చేయడానికి గత రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళం భారీ దాడులు చేసి, గగనతల ఆధిపత్యాన్ని సాధించింది’ అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉత్తర టెహ్రాన్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయం, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ కార్యాలయం ఉన్న పరిసర ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరిగినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (AP) అంతర్జాతీయ మీడియా నివేదించింది. పేలుడు ధాటికి ఒక భవనం నుంచి భారీగా పొగ ఆకాశంలోకి ఎగసిపడుతున్న దృశ్యాలు స్థానికంగా కనిపించాయి. ఈ దాడుల్లో ఎంత మంది చనిపోయారనేది తెలియాల్సి ఉంది.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు.. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక
ఖమెనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసిన ఇరాన్.. గల్ఫ్ ప్రాంతాలపైకి పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. వీటిలో చాలా వరకు దుబాయ్, అబుదాబి, ఖతార్, బహ్రెయిన్ దేశాల్లోని ప్రాంతాలను తాకాయి. ఈ దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై తాజా దాడులకు దిగడం గమనార్హం. మరోవైపు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) టెలిగ్రామ్ వేదికగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘మా దేశ సాయుధ దళాల చరిత్రలో మునుపెన్నడూ లేనంత భయంకరమైన ఆపరేషన్ ఏ క్షణంలోనైనా ప్రారంభం కావచ్చు. ఆక్రమిత ప్రాంతాలు, అమెరికా ఉగ్రవాద స్థావరాలే మా లక్ష్యం. ఉమ్మహ్ ఇమామ్ (ఖమేనీ) హంతకులను ఇరాన్ జాతి ప్రతీకార హస్తం విడిచిపెట్టదు. వారికి కఠినమైన, నిర్ణయాత్మకమైన శిక్ష తప్పదు’ అని ఆ పోస్ట్‌లో పేర్కొంది.






