హర్మూజ్ జలసంధి నుంచి వెళ్లే నౌక‌ల‌కు టోల్ ఛార్జీలు ?

by velandi.Saikiran |   (  Updated:2026-03-20 03:50:18  IST  )

హర్మూజ్ జలసంధి గుండా నౌకలు ప్రయాణించాలంటే, ఫీజు వ‌సూలు చేసే దిశ‌గా ఇరాన్ అడుగులు వేస్తోంది.

Iran to charge ‘toll-tax’ on Hormuz
X

Iran to charge ‘toll-tax’ on Hormuz

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ వ‌ర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 19 రోజులుగా ఈ మూడు దేశాల మ‌ధ్య వార్ భ‌యంక‌రంగా సాగుతోంది. సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ లాంటి వాళ్లు చ‌నిపోయినా ఇరాన్ త‌గ్గ‌డం లేదు. ఇక ఈ యుద్ధం నేప‌థ్యంలో చాలా దేశాల్లో చ‌మురు కొర‌త ఏర్ప‌డింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసిన నేప‌థ్యంలో నౌక‌లు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇండియా లాంటి కొన్ని దేశాల‌కు చెందిన నౌక‌లు హర్మూజ్ జలసంధి గుండా సాఫీగా వెళుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా లాంటి శత్రుదేశాల‌కు సంబంధించిన నౌక‌ల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డం లేదు ఇరాన్‌.

హర్మూజ్ జలసంధి నుంచి వెళ్లే నౌక‌ల‌కు టోల్ ఛార్జీలు ?

యుద్ధం భ‌యంక‌రంగా సాగుతోన్న నేప‌థ్యంలో హర్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇకపైన హర్మూజ్ జలసంధి గుండా నౌకలు ప్రయాణించాలంటే, కొంత మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన ఓ సభ్యుడు కూడా మీడియా ముందు ఈ ప్రకటన చేశాడు. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌక‌ల‌పై టోల్ విధించాలనే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు ఆయన షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

యుద్ధం ముగిసిన తర్వాత హర్మూజ్ జలసంధికి కొత్త రూల్స్ అందుబాటులోకి వస్తాయని కూడా తెలిపారు. తమపై ఆంక్షలు విధించిన దేశాలపై ఈ ఫీజులు వసూలు చేసే దిశగా నిర్ణయాలు ఉంటాయని వివరించారు. అయితే ఇరాన్ మిత్ర దేశాలకు ఈ టోల్ ఫీజు ఉంటుందా ? లేదా? అనేది క్లారిటీ రాలేదు. మొత్తానికి యుద్ధం ముగిసిన తర్వాత టోల్ ఫీజు తరహాలోనే నౌకలపై చార్జీలు వసూలు చేసే దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. ఇది ఇలా ఉండగా అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు ఈ జల సంధి మూసివేసినట్లు ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అధికారిక ప్రక్రియ చేశారు. మిగిలిన దేశాలన్ని ఈ జలసంధి ద్వారా ప్రయాణించవచ్చని వివరించారు.

హార్ముజ్.. ఇరాన్ కొత్త రూల్

Next Story