ఇరాన్ రివ‌ర్స్ ఎటాక్‌..ఖతర్, సౌదీలో భారీ పేలుళ్లు

by velandi.Saikiran |   (  Updated:2026-03-19 02:43:36  IST  )

ఖతర్ ( Qatar), సౌదీ అరేబియాపై ( Saudi) బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. రియాద్ లో భారీ పేలుళ్లకు పాల్పడింది.

ఇరాన్ రివ‌ర్స్ ఎటాక్‌..ఖతర్, సౌదీలో భారీ పేలుళ్లు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ ( Iran) వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాదాపు 18 రోజులుగా ఏ దేశం కూడా తగ్గకుండా యుద్ధంలో ముందుకు వెళ్తున్నాయి. వేలాది మంది చనిపోతున్నా, కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే చాలా మంది బడా లీడర్లు, అధికారులను కోల్పోయినప్పటికీ కూడా యుద్ధం కొనసాగిస్తోంది ఇరాన్. ఇక లేటెస్ట్ గా ముందుగా వార్నింగ్ ఇచ్చినట్లుగానే ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది.

ఖతర్ ( Qatar), సౌదీ అరేబియాపై ( Saudi) బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ముఖ్యంగా సౌదీ రాజధాని రియాద్ లో భారీ పేలుళ్లకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు మిస్సైల్స్‌ ను అడ్డుకున్నామని సౌదీ సివిల్ డిఫెన్స్ ప్రకటన చేసింది. మరోవైపు క్షిప‌ణి దెబ్బకు ఖ‌త‌ర్‌ లోని రస్ లఫాన్ రిఫైనరీ వద్ద మంటలు కూడా చెలరేగాయి. మిస్సైల్స్‌ శకలాలు పడడంతో ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ప్రైవేట్ విమానాలు కూడా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇరాన్ కు ఎదురు దెబ్బ‌..ఇంటెలిజెన్స్ మంత్రి మృతి

Next Story