- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్ కు ఎదురు దెబ్బ..ఇంటెలిజెన్స్ మంత్రి మృతి
ఇజ్రాయెల్ చేతిలో ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ హత్యకు గురైనట్లు ఇరాన్ ధృవీకరించింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికాపై పోరాటం చేస్తున్న ఇరాన్ దేశానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనిని కోల్పోయిన ఇరాన్, తాజాగా మరో మంత్రిని పోగొట్టుకుంది. ఇజ్రాయెల్ చేస్తోన్న భీకర్ దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ దుర్మరణం చెందారు. ఈ మేరకు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడిలో మరణించినట్లు వెల్లడించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి ఇస్మాయిల్ ఖతీబ్ అత్యంత సన్నిహితుడుగా వ్యవహరించారు. దీంతో ఇరాన్ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా తాజాగా ఇరాన్ సైనిక్ అధికారి అలీ లారిజాని మృతి చెందిన మరుసటి రోజే ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణించడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అయినప్పటికీ ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. ఎదురుదాడులకు పాల్పడుతోంది. తాజాగా ఖతర్, సౌదీని టార్గెట్ చేసింది ఇరాన్.
ఇరాన్ రివర్స్ ఎటాక్..ఖతర్, సౌదీలో భారీ పేలుళ్లు
Next Story






