మొజ్తబా ఖమేనీకి ఇరాన్ సుప్రీం లీడర్ బాధ్యతలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-01 09:34:49  IST  )

మొజ్తబా దయోసీ ఖమేనీని ఇరాన్ తదుపరి సుప్రీంలీడర్ గా ప్రకటించింది.

మొజ్తబా ఖమేనీకి ఇరాన్ సుప్రీం లీడర్ బాధ్యతలు
X

దిశ, వెబ్‌డెస్క్: అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ను అసెంబ్లీ సభ్యులు ఎన్నుకున్నారు. అలీ ఖమేనీ చిన్న కుమారుడు మొజ్తబా దయోసి ఖమేనీకి (Mojtaba Dayoosi Khamenei) సుప్రీం కమాండర్ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ఇరాన్ అధికారిక ప్రకటన చేసింది. ఖమేనీ రెండో కుమారుడికి దేశ సారధ్య బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పేర్కొంది. మొజ్తబా ప్రస్తుతం ఖోమ్ నగరంలోని ఒక విద్యాలయంలో మతాచార్యుడిగా ఉన్నారు. 1987-88 సమయంలో జరిగిన ఇరాన్ - ఇరాక్ యుద్ధంలో మొజ్తబా కీలకలంగా పనిచేశారు. 2009 ఎన్నికలపై నిరసనలను అణిచివేసేందుకు ఉపయోగించిన బాసిజ్‌ను కూడా తన ఆధీనంలోకి తీసుకున్నట్లు గత రికార్డులు చెబుతున్నాయి. కోమ్ లో చదువుకున్న మొజ్తబా.. ఆ తర్వాత మతాధికారి అయ్యాడు.

యూఎస్ ఎంబసీలపై ఇరాన్ దాడులు.. మళ్లీ ట్రంప్ వార్నింగ్

Next Story