యూఎస్ ఎంబసీలపై ఇరాన్ దాడులు.. మళ్లీ ట్రంప్ వార్నింగ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-01 09:33:58  IST  )

యూఎస్ ఎంబసీలపై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ప్రతీకారదాడులు చేస్తే ఎవరూ ఊహించని రీతిలో దాడులుంటాయని హెచ్చరించారు.

యూఎస్ ఎంబసీలపై ఇరాన్ దాడులు.. మళ్లీ ట్రంప్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమేనీ హత్యకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్.. గంటల వ్యవధిలోనే ప్రతీకార చర్యల్ని ప్రారంభించింది. దీంతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చినట్లైంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న మొత్తం 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ సైన్యం వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ పై కూడా క్షిపణులతో విరుచుకుపడుతోంది. దుబాయ్, దోహాలోని యూఎస్ స్థావరాలు, లెబనాన్ లోని యూఎస్ ఎంబసీపై దాడులు చేసింది. అమెరికా హద్దు మీరిందని అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ మరోసారి హెచ్చరించింది. యూఎస్ సైనిక స్థావరాలపై భీకర దాడులు తప్పవని, ఈ దాడుల్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్లలో సైరన్ లు మోగాయి.

ట్రంప్ మళ్లీ వార్నింగ్

ఇరాన్ తమపై ప్రతీకార దాడులు చేయకపోవడమే ఆ దేశానికి మంచిదని సూచించారు. ప్రతీకార దాడులు చేస్తే మరింత తీవ్రంగా బదులిస్తామని, ఎవరూ ఊహించని రీతిలో దాడులుంటాయని హెచ్చరించారు.

మొజ్తబా ఖమేనీకి ఇరాన్ సుప్రీం లీడర్ బాధ్యతలు

Next Story