- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iran meme war : ట్రంప్‌పై ఇరాన్ ‘మీమ్’ వార్! ‘మా దగ్గర తాళాలు లేవు.. పోయాయి’
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొత్త మలుపు తిరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొత్త మలుపు తిరిగింది. రణరంగంలో ఒకవైపు దాడులు జరుగుతుండగానే, మరోవైపు వివిధ దేశాల్లోని ఇరాన్ దౌత్య కార్యాలయాలు సోషల్ మీడియా (X) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ముప్పేట దాడి ప్రారంభించాయి. మీమ్స్, సెటైరికల్ కామెంట్లు, ఛలోక్తులతో ట్రంప్ ప్రకటనలకు ఎప్పటికప్పుడు గట్టి కౌంటర్లు ఇస్తూ ఇరాన్ ఎంబసీలు సమాచార యుద్ధానికి (Information War) తెరతీశాయి.
హార్ముజ్ జలసంధి వివాదం
హార్ముజ్ జలసంధిని తెరవకపోతే నరకం చూపిస్తానని, ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తానని ఇటీవల ట్రంప్ తీవ్ర స్థాయిలో అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి ఇరాన్ అత్యంత వ్యంగ్యంగా స్పందిస్తూ.. ‘మా దగ్గర తాళాలు లేవు, పోయాయి’ అని బదులిచ్చింది. ఇదే ధోరణిలో స్పందించిన సౌతాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ, ‘పూలకుండి కింద తాళాలున్నాయి, కానీ కేవలం ఫ్రెండ్స్ కోసం మాత్రమే హార్ముజ్ జలసంధిని తెరుస్తాం’ అంటూ సెటైరికల్ ట్వీట్ చేసి సోషల్ మీడియా క్యాంపెయిన్‌కు పదును పెట్టింది.
వివిధ దేశాల్లోని ఇరాన్ దౌత్య కార్యాలయాల సెటైర్లు
ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లు, ఆయన బెదిరింపులకు అధికారిక ప్రకటనల ద్వారా కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీల ద్వారా ఇరాన్ ఇలా బదులిచ్చింది. ఏప్రిల్ 4న జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ట్రంప్ చర్చల గురించి పదేపదే మాట్లాడుతుండటంతో.. ‘ట్రంప్.. ప్లీజ్ ఏదైనా మాట్లాడు, మాకు బోర్ కొడుతోంది’ అని ఎద్దేవా చేసింది. ఇరాన్‌లో ‘కొత్త పాలన’ వస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలను ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ఒక ‘ఏప్రిల్ ఫూల్స్ జోక్’గా కొట్టిపారేసింది. ‘రియాలిటీ చెక్, ట్వీట్లతో అధ్యక్షులు మారిపోరు, దానికి ఎన్నికలు కావాలి’ అని చురకలంటించింది.
హైదరాబాద్ కాన్సులేట్
ట్రంప్ వ్యవహార శైలిపై హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ కూడా వ్యంగ్యంగా స్పందించింది. ‘ఈ వ్యక్తి, అతని బృందం లేకపోతే X (ట్విట్టర్)కు అర్థం లేదు, అది చాలా బోరింగ్’ అని ట్వీట్ చేసింది. సియెర్రా లియోన్ ఎంబసీ ‘అవును సార్, మీరు కాల్చేశారు, గెలిచేశారు! ఇక ప్రశాంతంగా ఉండండి (Calm down)’ అంటూ సెటైర్ వేసింది.
సోషల్ మీడియా క్యాంపెయిన్
కాగా, దౌత్యపరమైన ప్రకటనలకే పరిమితం కాకుండా, ట్రంప్ వ్యాఖ్యల్లోని లొసుగులను, అమెరికాలో పెరుగుతున్న ఇంధన ధరలను ప్రస్తావిస్తూ ఇరాన్ ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్‌ను ఉధృతం చేసింది. సాంప్రదాయ యుద్ధంతో పాటు, నెటిజన్లను ఆకర్షించేలా మీమ్స్‌తో ‘రెండవ ఫ్రంట్’ను తెరిచి ట్రంప్‌ను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తోంది.






