- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధం వేళ హర్మూజ్‍పై చైనా కుయుక్తులు!.. భారత్‍కు కష్టాలు తప్పవా?
హార్మూజ్ జలసంధిని నియంత్రించేందుకు చైనా కుట్ర చేస్తోందనే ప్రచారం కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హార్మూజ్ (Strait of Hormuz) జలసంధిపై ఇరాన్ విధించిన ఆంక్షలు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నౌకల రాకపోకలపై ఇబ్బందులు ఏర్పడటంతో భారత్ సహా అనేక దేశాలకు వస్తురవాణా సేవలు నిలిచిపోయాయి. దీంతో ఈ హర్మూజ్ ను తెరిచేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు చైనా (China) తన ఒరిజినాలిటీని బయటపెట్టే ప్రయత్నం కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను ఆసరాగా చేసుకుని హార్మూజ్ జలసంధిని తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి చైనా పావులు కదుపుతోందని ఆప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు సౌరభ్ ముఖర్జియా (Saurabh Mukherjea) తాజాగా ఓ జాతీయ మీడియాతో చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
భారత్‍పై ఎఫెక్ట్!:
ఇరాన్‌తో చేతులు కలిపి చైనా హార్మూజ్ జలసంధిని తన అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సౌరభ్ పేర్కొన్నారు. ఇది జరిగితే ప్రపంచ చమురు సరఫరాలో ఎక్కువ భాగం చైనా చేతుల్లోకి వెళ్తుందని ఇది చైనాకు దక్కే అతిపెద్ద వ్యూహాత్మక విజయం అవుతుందని పేర్కొన్నారు. ఇది కేవలం స్వల్పకాలిక గొడవ మాత్రమే కాదు చమురు, వ్యూహాత్మక శక్తి కోసం జరుగుతున్న పోరాటం అన్నారు. హర్మూజ్ భారత (Indian) ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు. చైనా తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఇప్పటికే ఇరాన్‌తో 25 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్న బీజింగ్, అమెరికా ఆంక్షలను ధిక్కరించి ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. యూఏఈ, ఓమన్, ఇరాన్, పాకిస్థాన్‌లలో ఓడరేవులు, పైప్‌లైన్లు, రైల్వే నెట్‌వర్క్ కోసం చైనా బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో హార్మూజ్ పై చైనా ఆధిపత్యం పెరిగితే అది భారత్ పై కూడా ఎఫెక్ట్ చూపే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.






