- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్యా, అమెరికా మధ్య మళ్లీ స్నేహబంధం
రష్యా, అమెరికా సంబంధాల్లో సానుకూల మార్పు దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా, అమెరికా సంబంధాల్లో సానుకూల మార్పు దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మిన్స్క్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు పునఃప్రారంభించడానికి రష్యా సిద్ధంగా ఉందని చెప్పారు. అమెరికా రెండు గ్లోబల్ శక్తుల మధ్య సంబంధాలు కొంతమేర మెరుగు పడ్డట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయనపై ‘గొప్ప గౌరవం’ ఉందని ప్రకటించారు. ట్రంప్‌ను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ ప్రకటించారు.
గతంలో పిచ్చి.. ఇప్పుడు గుడ్
ట్రంప్ వెంటనే స్పందిస్తూ పుతిన్ చాలా మంచి వ్యాఖ్యలు చేశాన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపకపోవడంపై ట్రంప్ గతంలో పుతిన్‌పై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, రెండు దేశాలు సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్న ఆకాంక్ష మళ్లీ కనిపిస్తోంది. గతంలో పుతిన్‌ను ‘కంప్లీట్‌లీ క్రేజీ’ అన్న ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యల్లో ప్రశంసించారు. పుతిన్ అమెరికాను మళ్లీ గౌరవిస్తున్నారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అసాధ్యమే అని అన్నారు.
ఫోన్ లో మాట్లాడుకున్న ట్రంప్, పుతిన్
ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల సమయంలో రెండు వారాల క్రితం ట్రంప్, పుతిన్ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధమే అని ప్రకటించిన రష్యా, తుర్కియ రాజధాని ఇస్తాంబుల్ లో జరిగే అవకాశం ఉందన్నారు. ఎప్పుడు, ఏ సమయం అన్నది ఇంకా నిర్ధారించలేదని చెప్పారు. ఉక్రెయిన్ సైనికుల 3 వేల మంది డెడ్ బాడీలను తిరిగి ఇచ్చేందుకు రష్యా సిద్ధంగా ఉందని ప్రకటించారు. కాగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం లభిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More..






