- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమేనీ యుద్ధంలో గెలిచావని ఎలా చెబుతావు: Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికైన ‘ట్రూత్ సోషల్’లో ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలు పూర్తిగా నాశనం చేశామని పునరుద్ధాటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికైన ‘ట్రూత్ సోషల్’లో ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలు పూర్తిగా నాశనం చేశామని పునరుద్ధాటించారు. ఇజ్రాయిల్ ను ఇరాన్ ఓడించిందని తనను ‘సుప్రీమ్ లీడర్’ అనిపించుకునేందుకు అయతుల్లా ఖమెనీ అబద్ధాలు చెబుతున్నాడని ట్రంప్ విమర్శించారు. ‘ఇరాన్ భయంకరంగా నాశనమైంది. మూడు అణు కేంద్రాలు నాశనం అయ్యాయి. ఖమేనీ ఎక్కడ దాగి ఉన్నాడో తెలుసు. కానీ అతని ప్రాణాలు తీయమని అమెరికా లేదా ఇజ్రాయిల్ సైన్యానికి అనుమతి ఇవ్వలేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
అతి పెద్ద దాడిని తప్పించా
యుద్ధంలో తుది దశలో ఇజ్రాయెల్ వైమానిక దళాలు పెద్ద స్థాయిలో టెహ్రాన్ వైపు వెళ్లగా, తాను వాటిని వెనక్కి రప్పించానని ట్రంప్ వెల్లడించారు. ఇది యుద్ధంలో అతిపెద్ద దాడి అయి ఉండేదని పేర్కొన్నారు. ఎన్నో ప్రాణాలు పోతాయని, నేను వారిని ఆపానని ట్రంప్ చెప్పారు. అప్పుడు ఇరాన్‌పై ఆంక్షల తొలగింపు, పునరుద్ధరణకు చర్యలు కూడా ప్రారంభించాననని అన్నారు. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలను ఆపేసి అంతర్జాతీయ వ్యవస్థలోకి తిరిగి రావాలి. లేకపోతే పరిస్థితి మరింత ప్రమాదంగా మారుతుందని అని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా పైలెట్లు అద్భుతంగా లక్ష్యాలను ఛేదించారు. ‘మిడ్‌నైట్ హ్యామర్’ పేరుతో అమెరికా ఫోర్దో, నతాంజ్, ఇస్పహాన్ అణు కేంద్రాలపై అమెరికా బంకర్ బ్లస్టర్ బాంబులతో విధ్వంసం చేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Read More..






