బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-19 02:56:50  IST  )

బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొన్నాళ్ల క్రితం జరిగిన కాల్పల్లో గాయడపడ్డ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది సింగపూర్ లో చికిత్స పొందుతూ మరణించారు.

బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొన్నాళ్ల క్రితం జరిగిన కాల్పల్లో గాయడపడ్డ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది సింగపూర్ లో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. గురువారం రాత్రి 11గంటల సమయంలో ఆందోళనకారులు చత్తోగ్రామ్ లో ఉన్న భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇండియా, అవామీలీగ్ పార్టీలకు వ్యతిరేకంగా ఆందోళన కారులు నినాదాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే షరీఫ్ ఉస్మాన్ బిన్ హైది జులైలో అవామీలీగ్ నేత, ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో కీలక పాత్ర పోషించాడు. అప్పట్లో హైదీ భారత వ్యతిరేక వ్యాఖ్యలు సైతం చేశాడు. కాగా గత శుక్రవారం అతడిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఢాకాలో అతడి మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని డెయిలీ స్టార్ పత్రికా కార్యాలయంపైనా దాడి చేశారు. కవ్రాన్ బజార్ లోని ఓ కార్యాలయానికి నిప్పు పెట్టారు. కార్యాలయంలో 25మంది జర్నలిస్టులు ఉండగా వారిని స్థానికులు, ఫైర్ సిబ్బంది కాపాడారు. పత్రికా కార్యాలయాలపై దాడుల నేఫథ్యంలో దేశంలోని మూడు ప్రధాన పత్రికలు తమ కార్యక్రలాపాలను బహిష్కరించాయి.

Read More..

బంగ్లాదేశ్ లో హిందువు హత్య.. అనంతరం చెట్టుకు వేలాడదీసి దహనం

Next Story