- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగ్లాదేశ్ లో హిందువు హత్య.. అనంతరం చెట్టుకు వేలాడదీసి దహనం
బంగ్లాదేశ్ లో మైనార్టీలపై రోజురోజుకీ హింస పెరిగిపోతోంది.

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ లో మైనార్టీలపై రోజురోజుకీ హింస పెరిగిపోతోంది. అక్కడి మెమెన్ సింగ్ జిల్లాలోని భాలూకలో హిందూవైన ఓ ఫ్యాక్టరీ కార్మికుడు దీపూ చంద్ దాస్ పై మాబ్ హత్య జరిగింది. మహ్మద్ ప్రవక్తను అవమానించాడనే ఆరోపణలతో ఓ గుంపు అతనిపై దాడికి దిగింది. తీవ్రంగా కొట్టడంతో దీపూ అక్కడికక్కడే మరణించాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ఢాకా-మెమెన్ సింగ్ హైవేపై ఓ చెట్టుకు వేలాడదీసి తగలబెట్టారు. అతని కుటుంబ సభ్యులు ఎంత వేడుకున్నా ఎవరూ కనికరించకపోగా... జరిగిన దాడిని, దహనాన్ని వీడీయో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో బంగ్లాలో మైనార్టీల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాలో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. వీడియో
Read More..
బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు






