ఒమన్ తీరంలో నౌకపై డ్రోన్ దాడి.. చిక్కుకున్న 24 మంది భారతీయ నావికులు సేఫ్!

by Ramesh Naini |   (  Updated:2026-06-08 14:16:23  IST  )

ఒమన్ తీరంలో, హర్మూజ్ జలసంధి సమీపంలో సోమవారం ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ లేదా క్షిపణి దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.

ఒమన్ తీరంలో నౌకపై డ్రోన్ దాడి.. చిక్కుకున్న 24 మంది భారతీయ నావికులు సేఫ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒమన్ తీరంలో, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో సోమవారం ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ లేదా క్షిపణి దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. పలావు (Palau) దేశపు జెండాతో వెళ్తున్న ‘ఎంటీ మారివెక్స్ (MT Marivex)’ అనే ఆయిల్/కెమికల్ ట్యాంకర్‌పై జరిగిన ఈ దాడిలో నౌక ఇంజిన్ గదిలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే, ఈ నౌకలో ఉన్న 24 మంది భారతీయ సిబ్బంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు, వారంతా సురక్షితంగా ఉన్నట్లు భారత అధికారులు ప్రకటించారు.

ప్రమాదం జరిగిందిలా..?

ఒమన్ తీరానికి 15 నాటికల్ మైళ్ల దూరంలో నౌక ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. పేలుడు ధాటికి ఇంజిన్ గది దెబ్బతినడంతో నౌకలోకి వేగంగా నీరు చేరి, అదుపు తప్పింది. ప్రమాదం నుంచి తప్పించుకునే రక్షక పడవలు (లైఫ్ బోట్స్) కూడా దెబ్బతినడంతో సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురై అత్యవసర సహాయం (SOS) కోరుతూ సందేశాలు పంపారు. భారతీయ సిబ్బంది ప్రమాదంలో ఉన్నారని, తక్షణ సహాయం కావాలని ‘ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI)’ తొలుత వెల్లడించింది.

సిబ్బంది అంతా సేఫ్..

తీవ్ర ఆందోళనల మధ్య, భారత ఓడరేవులు, జల రవాణా మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ ఊరటనిచ్చే వార్తను పంచుకున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో నౌకలోని 24 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని ఆయన ‘ఎక్స్ (X)’ వేదికగా అధికారికంగా ధృవీకరించారు

Iran Attack: దాడులు ముగిస్తున్నాం.. ఇరాన్ సైన్యం కీలక ప్రకటన

Next Story