- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ పెద్దాయన కల నెలవేర్చిన సీఎం చంద్రబాబు
తన చిన్నప్పటి నుంచి ఆయన అంటే అభిమానం. ఒక్కసారన్నా కలవాలన్నది కల. 96 ఏళ్ల వయసులోనూ అదే కొరిక. సోషల్ మీడియా ద్వారా ఒక్కసారి మనస్పూర్తిగా కోరుకున్నారు. అంతే.. దెబ్బతో కల నెరవేరింది. దీంతో ఆయన ఆనందానికి అవదుల్లేవు. ...

దిశ, వెబ్ డెస్క్: తన చిన్నప్పటి నుంచి ఆయన అంటే అభిమానం. ఒక్కసారన్నా కలవాలన్నది కల. 96 ఏళ్ల వయసులోనూ అదే కొరిక. సోషల్ మీడియా ద్వారా ఒక్కసారి మనస్పూర్తిగా కోరుకున్నారు. అంతే.. దెబ్బతో కల నెరవేరింది. దీంతో ఆయన ఆనందానికి అవదుల్లేవు. ఈ జీవితానికి ఇది చాలు అని సంబరపడిపోతున్నారు.
సత్యనారాయణను కలిసిన చంద్రబాబు
పశ్చిమగోదావరి జిల్లా(West Godavari) కామధేనువులంక(KamaDhenuvulanka)కు చెందిన 96 ఏళ్ల సత్యనారాయణ(Satyanarayana) సీఎం చంద్రబాబు(Cm Chandrababu)ను కలవాలన్న కోరికను ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది సీఎం చంద్రబాబుకు చేరడంతో ఆయన ఒప్పుకున్నారు. ఈ రోజు స్వయంగా చంద్రబాబును ఆ పెద్దాయన కలుసుకున్నారు. చంద్రబాబును దగ్గర నుంచి చూసిన ఆయన కళ్లల్లో ఆనందం వేరే లెవల్ లో ఉన్నాయి. చంద్రబాబు మనస్ఫూర్తిగా హత్తుకుని మీరు 100 ఏళ్లకు పైగా జీవించాలని ఆశీర్వదించారు. అటు సీఎం చంద్రబాబు సైతం సత్యనారాయణను అప్యాయంగా పలకరించారు. తన పట్ల చూపిన అభిమానాన్ని చూసి చలించిపోయారు. సత్యనారాయణ కూర్చొని కాసేపు ముచ్చటించారు. పెద్దాయన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ అరుదైన ఘటన తన జీవితంలో జరగడంతో అటు సత్యనారాయణ ఎంతోగానే సంతోషించారు. ‘‘చంద్రబాబును కలిశాను.. నా కడుపు నిండిపోయింది. ఇక నేను రెండు రోజుల అన్నం తినను.’’ అంటూ సంబరపడిపోయారు. ఈ అరుదైన దృశ్యాన్ని సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పెద్దాయన ఆనందంపై వారు సైతం హర్షం వ్యక్తం చేశారు.






