- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ ఉద్యోగాల పేరుతో భారీ బురిడీ..
కండక్టర్ పోస్టులు ఇప్పిస్తానని ఓ కేటుగాడు నిరుద్యోగుల వద్ద నుంచి లక్షల్లో డబ్బు తీసుకుని మోసం చేశాడు.

దిశ, నాచారం: ప్రభుత్వ ఉన్నత అధికారులతో పరిచయాలు ఉన్నట్టు నమ్మించి, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టారు. సుమారు 70 మంది వద్ద ఒక్కొక్కరి వద్ద రూ. వేలల్లో నగదు వసూలు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన కేటుగాడిని కటకటాలకు నెట్టారు. ఈ సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటయ్య వెల్లడించిన వివరాల ప్రకారం.. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన్న మండలం ఇందిరా కాలనీకి చెందిన వడ్లూరి రాజశేఖర్(37) నాచారం బాబానగర్‌లో ఉంటూ రణవీర్ మాన్ పవర్ సర్వీస్ కార్యాలయం నిర్వహిస్తున్నాడు. తనకు టీఎస్ఆర్టీసీ ఉన్నత అధికారులతో పరిచయాలు ఉన్నాయని, డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మబలికారు. 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఉద్యోగాల పేరిట బాధితుల నుంచి నగదు, బ్యాంకు ట్రాన్సాక్షన్స్, యూపీఐ లావాదేవీల ద్వారా డబ్బును దండుకున్నాడు.
అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు..
ఉద్యోగం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఉద్యోగాలు రాకపోవడంతో పాటు తమ డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించిన నిరుద్యోగి వడ్లకొండ వినయ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో నిందితుడు ఇప్పటివరకు 48 మంది బాధితులను గుర్తించగా.. వారి వద్ద నుంచి రూ. 21 లక్షల 35000 వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. నిందితుడు రాజశేఖర్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు గుండ్లపల్లి ప్రవీణ్ కుమార్, నరేష్ పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగాలు, ఇతర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల పేరిట డబ్బులు చెల్లించిన వ్యక్తులు నాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్సై వెంకటయ్య సూచించారు.






