ఆటోను ఢీకొన్న కారు.. ఆటో డ్రైవర్ మృతి

by Batti.Sumithra |

కారు డ్రైవర్ అతివేగం ఓ ఆటో డ్రైవర్ ప్రాణాన్ని బలితీసుకుంది.

ఆటోను ఢీకొన్న కారు.. ఆటో డ్రైవర్ మృతి
X

దిశ, రాజేంద్రనగర్ : కారు డ్రైవర్ అతివేగం ఓ ఆటో డ్రైవర్ ప్రాణాన్ని బలితీసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను ఎస్‌ఐ రాఘవేందర్ తెలిపారు. అప్పా జంక్షన్ నుంచి హిమాయత్‌సాగర్ వైపు సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న ఆటోను అప్పా జంక్షన్ కూడలి వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో మియాపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ మాసూద్ (27) తీవ్రంగా గాయపడ్డాడు. ఆటోలో ఉన్న మరో ముగ్గురు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. గాయపడిన ఆటో డ్రైవర్‌ను స్థానికులు వెంటనే సమీపంలోని షాదన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ సోమవారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటన పై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story