భార‌త్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ టైమింగ్స్ మార్పు

by velandi.Saikiran |

భార‌త్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ టైమింగ్స్ మార్పులు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

భార‌త్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ టైమింగ్స్ మార్పు
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మధ్య వచ్చే నెలలో టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఈ సిరీస్ నేపథ్యంలో ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సిరీస్ లో భాగంగా జరిగే మ్యాచ్ ల‌ను ఒక గంట ముందుగానే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్ లో ఈ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రతి మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అలా నిర్వహిస్తే, ఇండియాలో వ్యూయర్ షిప్‌ తగ్గిపోతుంది. ఈ క్రమంలో ఒక గంట ముందుగానే, అంటే దాదాపుగా 10 గంటలకు మ్యాచ్ లు ప్రారంభమయ్యేలా నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. దీంతో భారత అభిమానులకు బిగ్ రిలీఫ్ దక్కింది. కాగా జూలై 1వ తేదీన ఈ ఐదు టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. జూలై 11 తో సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాత ఈ రెండు జట్ల మధ్య 3 వన్డేలు ప్రారంభం అవుతాయి.

Next Story