- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూవివాదం పై ఎస్సీ కమిషన్ నోటీసు
కోహెడలో ప్రతిపాదిత ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం దళితుల భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ కోహెడ భూ బాధితులు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ను ఆశ్రయించారు.

దిశ, తుర్కయంజాల్ : కోహెడలో ప్రతిపాదిత ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం దళితుల భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ కోహెడ భూ బాధితులు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ను ఆశ్రయించారు. సోమవారం కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబుకు కోహెడ భూ బాధితులు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు నోటీసు జారీ చేసి, పూర్తి వివరాలతో కూడిన నివేదికను 15 రోజులలోపు సమర్పించాలని ఆదేశించారు.
కోహెడ గ్రామ పరిధిలోని దళిత రైతులకు చెందిన భూములను వారి సమ్మతి లేకుండా మార్కెట్ నిర్మాణం కోసం తీసుకున్నారని, దీనివల్ల అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని భూ బాధితులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అందిన ఫిర్యాదులను ప్రాథమికంగా పరిశీలించిన కమిషన్, ఆరోపణల పై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి కొండ్రు పురుషోత్తం, సీనియర్ నాయకులు బలదేవ్ రెడ్డి, కొత్త రామ్ రెడ్డి, కరాడి అనిల్ కుమార్, కోహెడ భూ బాధితులు పంది సతీష్, అంగద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.






