ఎమ్మెల్యే సారూ.. మీరు రైతులకు ఇచ్చిన మాటకు విలువ లేదా

by Batti.Sumithra |

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రైతులకు భరోసా ఇస్తూ గత నెల 25న ప్రకటన విడుదల చేశారు.

ఎమ్మెల్యే సారూ.. మీరు రైతులకు ఇచ్చిన మాటకు విలువ లేదా
X

దిశ, కామారెడ్డి : రైతులు అధైర్య పడి రోడ్లు ఎక్కి ధర్నాలు చేయవద్దని, చివరి గింజ వరకు వడ్లు అధికారులు కొనుగోలు చేస్తారని, ఆ బాధ్యత నేను తీసుకుంటున్నానని, అవసరమైతే హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి సహాయం పొందాలంటూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి రైతులకు భరోసా ఇస్తూ గత నెల 25న ప్రకటన విడుదల చేశారు. దీంతో కామారెడ్డి నియోజకవర్గంలోని రైతులు ఎమ్మెల్యే ఇచ్చిన మాటకు విలువ ఇస్తూ ధర్నాలు, ఆందోళనలు విరమించుకున్నారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం ఈ నెల 5 వరకు తమ వడ్లు ఎలాగైనా పోతాయనే భరోసాతో ఇన్ని రోజులు ఎదురు చూశారు. ఆయన ఇచ్చిన డెడ్ లైన్ ఈనెల 5తో ముగియగా 6 నుంచి రైతులు సోషల్ మీడియాలో ఎమ్మెల్యే సారూ ఏమైంది మీ హామీ.. అంటూ ప్రశ్నిస్తున్నారు. వరుసగా వర్షాలు కురుస్తుండడంతో కళ్లాల్లోని ధాన్యం, ధాన్యం బస్తాలు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకొని అధికారులతో వడ్లు కొనుగోలు చేసేలా చూడాలని కోరుతున్నారు.

Next Story