విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రి కుమారస్వామి

by velandi.Saikiran |

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్ర‌మాదం జ‌రిగిన త‌రుణంలో కేంద్ర మంత్రి కుమారస్వామి ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రి కుమారస్వామి
X

దిశ‌, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హుటా హుటిన విశాఖకు చేరుకున్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. మరో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ప్రమాద సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అధికారులు... ప్రమాదానికి సంబంధించిన విషయాలను కేంద్రమంత్రి కుమారస్వామికి వివరించారు. అనంత‌రం ఆస్ప‌త్రిలో ఉన్న క్ష‌త‌గాత్రుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు.

స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం సోమవారం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ లోని ఎంఎస్ఎస్ 2, STC 3 హీట్ ఎఫ్ జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో 9 మంది మృతి చెందగా... పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అటు ఈ ప్రమాద సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల‌ చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటన చేశారు.

Next Story