- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అర్ధరాత్రి నుంచే భారీ వర్షాలు.. బయటికి రావొద్దంటూ ఆదేశాలు!
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచే భారీ వర్షాలు పడనున్నట్లు అధికారులు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణలో అర్ధరాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం పడుతోందని, రానున్న గంట సేపట్లో కొన్ని ప్రాంతాల్లో 100 మిల్లీ మీటర్ల వరకు వర్షం పడుతుందని అంచనా వేశారు అధికారులు. ఈ అర్ధరాత్రి సమయంలో ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని కూడా వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బయటకు అస్సలు రాకూడదని సూచనలు చేశారు. ఇటు హైదరాబాద్ మహా నగరంలో కూడా అర్ధరాత్రి వర్షం షురూ కానున్నట్లు వెల్లడించారు. ఏపీలో మంగళవారం పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.






