వైభవ్ పై ఎక్కువగా అంచ‌నాలు పెట్టుకోవ‌ద్దు - సౌరవ్ గంగూలీ

by velandi.Saikiran |

వైభవ్ పై ఎక్కువగా అంచ‌నాలు పెట్టుకోవ‌ద్దు అంటూ సౌరవ్ గంగూలీ కీల‌క‌ వ్యాఖ్య‌లు చేశారు.

వైభవ్ పై ఎక్కువగా అంచ‌నాలు పెట్టుకోవ‌ద్దు - సౌరవ్ గంగూలీ
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో అదరగొట్టిన వైభవ్, భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో జరిగే టీ20 సిరీస్ లలో వైభవ్ ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో వైభవ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సౌరవ్ గంగూలీ. వైభవ్ పై ఎక్కువగా అంచనాలు పెట్టుకోకూడదని.. అతన్ని వదిలేయండి అంటూ కోరారు.

సచిన్ టెండూల్కర్ తరహాలో చిన్న వయసులో భారత జట్టులోకి వైభవ్ వస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అలాంటి బుడ్డోడిపై అంచనాలు భారీగా పెట్టుకోకూడదని కోరారు. ఇంత చిన్న వయస్సులో ఒత్తిడిని తట్టుకోవడం కష్టమే.. అందుకే వైభవ్ ను ఫ్రీగా వదిలేయాలని స్పష్టం చేశారు. దీంతో సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Next Story