కస్టడీలో నిందితురాలి ఆత్మహత్యాయత్నం.. పోలీసు కానిస్టేబుళ్ల పై వేటు

by Batti.Sumithra |

తాండూరు సబ్‌ డివిజన్ పరిధిలోని ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల పై వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు శాఖాపరమైన వేటు పడింది.

కస్టడీలో నిందితురాలి ఆత్మహత్యాయత్నం.. పోలీసు కానిస్టేబుళ్ల పై వేటు
X

దిశ, తాండూర్ రూరల్ : తాండూరు సబ్‌ డివిజన్ పరిధిలోని ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల పై వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు శాఖాపరమైన వేటు పడింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన తాండూరు జంట హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కరీమా బేగం విచారణలో భాగంగా కరణ్‌కోట్ పోలీస్టేషన్‌కు తరలించారు. విచారణలో ఉండగా కరీమాబేగం బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

ఈ సమయంలో విధుల్లో ఉన్న బషీరాబాద్‌కు చెందిన మహిళ కానిస్టేబుల్ సునీత, యాలాల పోలీస్టేషన్‌కు చెందిన బసవరాజులు వీధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ఉన్నతాధికారులు నిర్దారించారు. ఈ సంఘటన పై జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్ల పై సస్పెన్షన్ వేటు వేశారు. సోమవారం జిల్లా ఎస్పీ సస్పెన్షన్‌ ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిందితులను అదే రోజు చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యంగా నిలకడగా ఉంది.

Next Story