- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ujjwala LPG Subsidy: యుద్ధ భయాలతో గ్యాస్ సబ్సిడీకి కేంద్రం బ్రేక్
సిలిండర్‌పై ఇచ్చే రూ. 300 రాయితీ మొత్తంలో ఎలాంటి మార్పూ లేదు కానీ, సబ్సిడీ వచ్చే సిలిండర్ల సంఖ్యను మాత్రం సగానికి పైగా తగ్గించేశారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఏడాదికి తొమ్మిది ఎల్పీజీ సిలిండర్లపై అందిస్తున్న రూ. 300 సబ్సిడీని ఇకపై కేవలం నాలుగు రీఫిల్స్‌కే పరిమితం పరిమితం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే సిలిండర్‌పై ఇచ్చే రూ. 300 రాయితీ మొత్తంలో ఎలాంటి మార్పూ లేదు కానీ, సబ్సిడీ వచ్చే సిలిండర్ల సంఖ్యను మాత్రం సగానికి పైగా తగ్గించేశారు. దీనివల్ల ఉజ్వల పథకం కింద ఉన్న పేద కుటుంబాలకు ఏడాదికి గరిష్టంగా రూ. 1,200 మాత్రమే డైరెక్ట్ సాయం అందుతుంది. నిజానికి 2016లో ఈ స్కీమ్ మొదలైనప్పుడు ఏడాదికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీ ఇచ్చేవారు. ఆ తర్వాత ఆ సంఖ్యను 9కి తగ్గించగా.. ఇప్పుడు అంతర్జాతీయంగా మారిన పరిస్థితుల వల్ల ఏకంగా 4 సిలిండర్లకే కుదించాల్సి వచ్చింది
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల విదేశాల నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునే ఖర్చు ప్రభుత్వానికి భారంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో గ్యాస్ సిలిండర్ అసలు ధర రూ. 1,600 దాటిపోగా, ప్రభుత్వం భారం భరించి సామాన్య కస్టమర్లకు ఢిల్లీలో రూ. 942కే అందిస్తోంది. అంటే ఒక్కో సిలిండర్‌పై ప్రభుత్వ చమురు కంపెనీలు దాదాపు రూ. 700 వరకు నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు ఉజ్వల కస్టమర్లకు అదనంగా మరో రూ. 300 సబ్సిడీ ఇవ్వడంతో వారికి సిలిండర్ రూ. 642కే దొరుకుతోంది. ఈ విధంగా చమురు కంపెనీలపై పడుతున్న వేల కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికే, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గించినట్లు స్పష్టమవుతోంది.






