సెకండ్ హ్యాండ్ ఫోన్లతో అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ నితికా పంత్

by Batti.Sumithra |

సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు.

సెకండ్ హ్యాండ్ ఫోన్లతో అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ నితికా పంత్
X

దిశ, ఆసిఫాబాద్ : సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. శనివారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన మొబైల్ ఫోన్ల రికవరీ మేళాలో బాధితులకు వారి మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన సుమారు రూ. 23.40 లక్షల విలువైన 117 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ మొబైల్ ఫోన్లను ప్రత్యేక రికవరీ బృందం వివిధ ప్రాంతాల నుంచి గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్ రికవరీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చోరీకి గురైన మొబైల్ ఫోన్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆమె, సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే ముందు యజమాని వివరాలు, సంబంధిత పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని పేర్కొన్నారు. దొంగిలించిన మొబైల్ ఫోన్ల కొనుగోలు లేదా విక్రయాల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story