వారణాసి మూవీ నుంచి మరో అప్డేట్... ఆ భామకు ఛాన్స్!

by velandi.Saikiran |

మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

వారణాసి మూవీ నుంచి మరో అప్డేట్... ఆ భామకు ఛాన్స్!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వారసత్వాన్ని అందుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. వయసు పైబడినప్పటికీ కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. అలాంటి మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేస్తుండగా... ప్రియాంక చోప్రా స్పెషల్ రోల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఓ కీలక అప్డేట్ వైరల్ గా మారింది. ఈ మూవీలో మరో హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన మరో భామను జక్కన్న తీసుకున్నారట. ఆమె ఇందులో ఒక గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రిన్స్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అప్డేట్ ఇస్తారని తెలుస్తోంది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

Next Story