మన రాష్ట్రంలోనూ అడుగుతున్నాం.. రాజీనామా చేస్తారా: మాజీ సీఎం జగన్

by Vemula.Srinu Prasad |

ట్ ప్రశ్నాపత్రం లీకేజీపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగా డీఎస్సీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేస్తారా అని మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు..

మన రాష్ట్రంలోనూ అడుగుతున్నాం.. రాజీనామా చేస్తారా: మాజీ సీఎం జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగా డీఎస్సీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేస్తారా అని మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. శనివారం ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ పలు ఆరోపణలు చేశారు. ‘‘నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’. ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్‌ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారా?, లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?.’’ అంటూ జగన్ ట్వీట్‌లో ప్రశ్నించారు.

Next Story